ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న హీరోలంతా స్పీడ్ గా దూసుకెళ్తుంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం వెనకబడి పోయాడు అన్పిస్తోంది ఆయన అభిమానులకు. “గద్దల కొండ గణేష్” తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా విడుదల కాలేదు. ఆయన చేతిలో ఉన్న ఉన్న రెండు సినిమాలు “గని”, “ఎఫ్3” ఇంకా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వరుణ్ తేజ్ మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామా “గని”. ఈ చిత్రం గురించి జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచడమే కాదు బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ సినిమాలో భాగం కావడం ఆసక్తిని పెంచేసింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న “గని” చిత్రాన్ని అల్లు బాబీ సహకారంతో రెనైస్సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ దీనిని సమర్పిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో సాయి మంజ్రేకర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Read Also : రూటు మార్చిన “టక్ జగదీష్”
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో “ఫన్ అండ్ ఫ్రస్టేషన్” సీక్వెల్ “ఎఫ్3” షూటింగ్ కూడా జరుగుతోంది. ఇందులో వెంకటేష్, తమన్నా, మెహ్రీన్ లతో వరుణ్ స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్నాడు. ఇటీవల కాలంలో ఈ సినిమాలకు సంబంధించి వరుణ్ అభిమానులను సర్ప్రైజ్ చేసే అప్డేట్ ఏదీ రాలేదు. దీంతో వరుణ్ తేజ్ స్పీడ్ పెంచితే బాగుంటుదని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. ఇలాంటి తరుణంలో అభిమానులను మెగా లెవెల్లో సర్ప్రైజ్ చేయబోతున్నాడట వరుణ్ తేజ్. ఓ పాన్ ఇండియా సినిమాకు ఈ యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆగష్టు 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతోందని, సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు అప్పుడే అప్డేట్ చేస్తారని అంటున్నారు.