Site icon NTV Telugu

Tollywood : మెల్లగా తెలుగు మార్కెట్ లో పాగా వేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు

Dhanush

Dhanush

మమ్ముట్టి సన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులో మాత్రం తనకంటూ ఓన్ మార్కెట్ అండ్ ఐడెంటిటీనీ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటితో తనపై ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్‌ని సీతారామంతో చెరిపేసుకున్న దుల్కర్ టాలీవుడ్‌ను సెకండ్ హౌస్‌గా మార్చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా తనను తెలుగు హీరోగా ఓన్ చేసుకోవడంతో మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఇక్కడ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. వెంకీ అట్లూరీతో లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఓ తార’ చేస్తున్నాడు.

Also Read : Committee Kurrollu : సైమా2025 బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ‘సందీప్ సరోజ్’

ఇక దుల్కర్‌నే ఫాలో అవుతున్నాడు ధనుష్. పాన్ ఇండియాలో తన రేంజ్ పెంచుకునేందుకు కేవలం తమిళం, హిందీలో నటిస్తే సరిపోదని త్వరగానే బోధపడిన హీరోకు తెలుగు ఆడియన్స్ మెప్పు కోసం నేరుగా ఈ భాషలోనే సినిమాలు చేస్తున్నాడు. వెంకీ అట్లూరీతో సార్, శేఖర్ కమ్ములతో కుబేరతో డబుల్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ కొల్లగొట్టిన ధనుష్ నెక్ట్స్ మరో టాలీవుడ్ దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.  టాలీవుడ్‌లో సామాజిక విలువలతో కూడిన సినిమాలు తెరకెక్కించే అతికొద్ది దర్శకుల్లో వేణు ఉడుగుల ఒకరు. ఆయన తీసినవి జస్ట్ టూ ఫిల్మ్స్ మాత్రమే. నీది నాది ఒకే కథ, విరాట పర్వం రెండూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ దర్శకుడితోనే నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట ధనుష్. యువి క్రియేషన్స్ నిర్మిస్తుందని సమాచారం. ధనుష్ లైనప్ లో చాలా మందే ఉన్నా కూడా వేణుతో చేసేందుకు ధనుష్ ఇంట్రెస్ట్ గా ఉన్నారట. ఇలా అటు తమిళ్ హీరో ధనుష్ ఇటు దుల్కర్ మెల్లగా తమ మార్కెట్ ను తెలుగులో పెంచుకునేందుకు ఇక్కగా పాగా వేసేందుకు ప్లానింగ్ లో ఉన్నారు.

Exit mobile version