Committee Kurrollu : సైమా2025 బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ‘సందీప్ సరోజ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై వచ్చిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నటిగా, నిర్మాతగా నిహారిక కొణిదెల ఈ చిత్రంతో అవార్డులు, రివార్డులు అందుకుంటూనే ఉన్నారు. థియేటర్లో కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్‌గా రూ.18.5 కోట్లు వసూళ్లను రాబడితే, నాన్ థియేట్రికల్‌గా రూ.6 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా సినిమా రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు అనేక వేదికలపై అవార్డుల్ని కొల్లగొట్టేస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీకి మంచి గుర్తింపు లభించింది.
Also Read : Little Hearts : ఓవర్సీస్ లో పవర్ స్టార్ సినిమా కలెక్షన్స్ ని దాటేసిన లిటిల్ హార్ట్స్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ అవార్డ్స్ గెలుచుకుంది. రీసెంట్‌గా జరిగిన గామా అవార్డుల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యదు వంశీకి గామా అవార్డులు వచ్చాయి. ఇక తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా 2025 వేడుకల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకుగాను బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్ కి సైమా అవార్డు వచ్చింది. దీంతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. నిర్మాతగా తొలి ఫీచర్ ఫిల్మ్‌తోనే నిహారిక టాలీవుడ్‌లో ఓ హిస్టరీని క్రియేట్ చేసినట్టు అయింది. ఈ మూవీకి యదు వంశీ డైరెక్టర్‌గా, ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫర్‌గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ సినిమాకు మన్యం రమేష్ ప్రొడక్షన్ వ్యవహరాల్ని చూసుకున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9, 2024న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!