చెన్నై చంద్రం త్రిష మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జూలై 3న కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ “యూటర్న్” డైరెక్టర్ పవన్ కుమార్‌తో కలిసి తన మొదటి చిత్రం “ద్విత్వా” అనే సైకలాజికల్ థ్రిల్లర్ ను ప్రకటించారు. సంస్కృతంలో ద్వంద్వత్వం అనేది టైటిల్ అర్థం. దీనిని ‘కెజిఎఫ్’ ఫ్రాంచైజ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు శాండల్‌వుడ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్ గా త్రిష ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ నుండి షూటింగ్ చిత్రబృందం ప్రారంభించనుంది.
Read Also : నాగ శౌర్యకు రానా హెచ్చరిక !!
త్రిష, పునీత్ రాజ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ “పవర్”లో జంటగా కన్పించారు. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. వారి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అప్పటి నుండి ఈ కాంబో మళ్ళీ తెరపైకి రాలేదు. త్రిష చేసిన మొదటి ఆఖరి కన్నడ చిత్రం కూడా “పవర్”. ఇంత గ్యాప్ తరువాత కన్నడ ఇండస్ట్రీకి త్రిష రీఎంట్రీ ఇస్తోంది. ఆమెకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చిందట. మరోవైపు త్రిష ప్రస్తుతం మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్” చిత్రీకరణలో ఉన్నారు. ఆమె కిట్టిలో గార్జనై, రాంగి, రామ్, సతురంగ వెట్టై 2 వంటి 4 భారీ చిత్రాలున్నాయి.