టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖ నిర్మాతలు ఆ డిస్ట్రిబ్యూటర్ పై గుర్రుగా ఉన్నారా అంటే అవును అనే సంధానం వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ ఉత్తరాంధ్ర కు చెందిన ఎల్వీర్( ఎల్ వెంకటేశ్వరరావు). వెస్ట్ గోదావరి సినిమా పంపిణిలో ఈ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఎల్వీర్ చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు దారితీసింది. ఎల్వీర్ మాట్లాడుతూ ‘ గత రెండెళ్లుగా ఏడిస్ట్రిబ్యూటర్ కూడా కనీసం కమిషన్ కళ్ల చూడలేదని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక్కటే తమకు భారీ లాభాలు తెచ్చిపెట్టినదని, రెండేళ్లుగా ఏ స్టార్ హీరో సినిమా కూడా కమిషన్ ఇచ్చే రేంజ్ హిట్ కాలేదని, ఒరిజినల్ కలెక్షన్స్ బయటకు చెప్పలేము అని అలా చెబితే, ఆ నిర్మాత తరువాత తమకు సినిమా ఇవ్వరని’ అని అన్నారు.
Also Read : Netflix : నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’
అయితే ఎల్వీర్ చేసిన వ్యాఖ్యలు గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కొందరు స్టార్ హీరోలనుద్దేసించి ఉన్నాయని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. పోయిన సంవత్సరం దేవర, కల్కి, పుష్ప 2 వంటి సూపర్ హిట్స్ సినిమాలు వచ్చాయి. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. పుష్ప ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కానీ ఎల్వీర్ చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమాలు కూడా నష్టాలు తెచ్చినట్టే. నష్టాలు వచ్చాయో లాభాలు వచ్చాయో మాకు తెలుసు, స్టేజ్ ఎక్కించారు మైక్ ఇచ్చారు కదా అని ఆపుకోలేక ఇష్టానురీతీగ మాట్లాడం సరికాదని, సదరు డిస్ట్రిబ్యూటర్ కారణంగా ఎంత మంది ఎగ్జిబిటర్లు నష్టాలు చూసి సినిమా వ్యాపారం వదిలేసారో తమకు తెలుసనీ, ఇక్కడ కొన్ని చూసి చూడనట్టు ఉండాలి తప్ప ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం సబబు కాదని నిర్మాతల సర్కిల్స్ లో వినిపిస్తోంది.