Tollywood: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయితే, అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు తయారైంది టాలీవుడ్ రిలీజ్‌ల పరిస్థితి. అసలు విషయం ఏమిటంటే, సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. ఈ సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే, సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ కూడా పనికివచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయని భావించేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్‌లో అసలు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నెల మొత్తం మీద రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కేవలం రెండే—నాని నటించిన ‘హిట్ 3’ తో పాటు ‘సింగిల్’.
Also Read:Hari Hara Veera Mallu: హైపెక్కిస్తారట రెడీగా ఉండండి!
Also Read
- Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
- Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
- Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
- George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
వాస్తవానికి, ఈ నెల మొత్తం మంచి రిలీజ్ స్లాట్‌లు ఉన్నాయి. కానీ, ఏ ఒక్క సినిమా కూడా పూర్తిగా రిలీజ్‌కు రెడీ కాకపోవడంతో, మే 30వ తేదీన రావాల్సిన ‘కింగ్‌డమ్’ కూడా వాయిదా పడింది. నిజానికి, మే 9వ తేదీన ‘హరిహర వీరమల్లు’ రావాల్సి ఉంది. కానీ, ఆ సినిమా కంటెంట్ కూడా రెడీ కాకపోవడంతో దాన్ని కూడా వాయిదా వేశారు.
Also Read: SSMB29: మరో స్టార్ హీరోను దింపుతున్న జక్కన్న
ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, వస్తే అన్ని సినిమాలు కట్టకట్టుకుని ఒకేసారి రిలీజ్ డేట్స్ మీద దండయాత్ర చేస్తున్నాయి. లేదంటే, థియేటర్లు ఖాళీగా ఉండి, ఏ సినిమా వేయాలా అని ఎగ్జిబిటర్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరికి వారు తమ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడంతో ఈ తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. సమిష్టిగా నిర్మాతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప, దీనికి సరైన సొల్యూషన్ దొరకదు.
ఇప్పుడు థియేటర్లు ఖాళీగా ఉండడంతో, సినిమాల రీ-రిలీజ్‌లు చేయాలని కూడా ఎగ్జిబిటర్లు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద, టాలీవుడ్‌లో ఈ అతివృష్టి-అనావృష్టి పరిస్థితి మరోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది.
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!