అయితే, అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు తయారైంది టాలీవుడ్ రిలీజ్‌ల పరిస్థితి. అసలు విషయం ఏమిటంటే, సంక్రాంతి తర్వాత సమ్మర్ మంచి సీజన్. ఈ సీజన్‌లో సినిమాలు రిలీజ్ చేస్తే, సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ కూడా పనికివచ్చి మంచి కలెక్షన్స్ వస్తాయని భావించేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్‌లో అసలు సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నెల మొత్తం మీద రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కేవలం రెండే—నాని నటించిన ‘హిట్ 3’ తో పాటు…