మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌తో పాటు, ఒడిశాలో కొంత షూటింగ్ జరిగింది. ప్రస్తుతం వేసవి కాలం సెలవులు ఇవ్వడంతో మహేష్ బాబు ఎప్పటిలాగే వెకేషన్‌కు వెళ్లిపోయారు.
Also Read: Vijay Devarakonda : అతని మ్యూజిక్ వింటూ ఎమ్మారై స్కాన్ చేయించుకున్నా
ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు స్పష్టత వచ్చింది. అయితే, ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి, ఈ ప్రచారం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది, కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. గతంలో పృథ్వీరాజ్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే మొదలై, తర్వాత ఆయన నిజంగానే సినిమాలో భాగమయ్యారు. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో చూడాలి.
Also Read:Akash Puri : బడా సినిమాలో ఆకాశ్ పూరి..?
గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు, తెలుగు జర్నలిస్టుల నుంచి విక్రమ్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన మాట్లాడుతూ, “నిజానికి నేను రాజమౌళితో టచ్‌లోనే ఉన్నాను. భవిష్యత్తులో ఒక సినిమా చేయొచ్చు. కానీ, మహేష్‌తో సినిమా గురించి అలాంటి చర్చ జరగలేదు,” అని చెప్పుకొచ్చారు. విక్రమ్ ఈ సినిమాలో భాగమవుతాడా లేక ఈ ప్రచారం అంతటితో ఆగిపోతుందా అనేది చూడాలి.