భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు కూడా సాధించలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం పై మిశ్రమ స్పందన వెల్లువెత్తడంతో.. వసూళ్ల పై ప్రభావం చెప్పినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల కమల్ కెరీర్ లో అత్యల్ప ప్రారంభ వసూళ్లు సాధించి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ. 65 లక్షలు సాధించగా.. రెండో రోజు వసూళ్లు మరింత పడిపోయాయి.
Alos Read : Karthik Dandu: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ డైరెక్టర్.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్
భారీ బడ్జెట్ తో తీసినప్పటికి.. బలమైన కంటెంట్ లేకపోతే విజయం సాదించడం కష్టమని ఈ సినిమా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, నాజర్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. కానీ ఏ మాత్రం లాభం లేకుండా పోయింది. ఈ మూవీపై కమల్ చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ..ఆశలని అడియాశలయ్యాయి. ఇక పోతే థియేటర్స్ లో విడుదలకి ముందు మేకర్స్ ఈ సినిమాని ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారి అభిప్రాయాలు మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా. మేకర్స్ వారితో ప్రస్తుతం చర్చల్లో ఉన్నట్టు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.