ఒక్కప్పుడు ఇండస్ట్రీలో పెళ్లి అంటే ఆమడ దూరంలో ఉండేవారు. కానీ ప్రజెంట్ ట్రెండ్ మారింది. హీరోలు, హీరోయిన్‌లు, దర్శకనిర్మతలు.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘విరూపాక్ష’ మూవీ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కార్తీక్.. హర్షిత అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Renu Desai : నిజాయితీగా ఉండాలంటే.. దేనికైనా సిద్ధంగా ఉండాలి
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు కార్తీక్ దండు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రజంట్ కార్తీక్ అక్కినేని హీరో నాగ చైతన్యతో ఓ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్సమెంట్ ఇంకా చేయనప్పటికీ.. అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.