మోహన్ లాల్ హీరోగా పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ మార్చి 27న రిలీజై రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లోతరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేసాడు మోహన్ లాల్. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మోహన్ లాల్ తో జత కట్టింది సీనియర్ నాటి శోభన.
Also Read : RAPO 22 : రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.?
ఫ్యామిలీ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజై మౌత్ టాక్ తో కలెక్షన్స్ తో కల్లోలం చేస్తోంది. సైలెంట్ గా రిలీజ్ అయి ఆరు రోజులలోనే వంద కోట్ల క్లబ్‌లోకి జాయిన్ అయింది. ఇక రెండవ వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన తుడరుమ్ మూడవ వారంలోకి అడుగుపెట్టింది. మూడవ శనివారం రూ. 3.16 కోట్లు రాబట్టి రిలీజ్ అయిన 16 రోజులకు గాను రూ. 195 కోట్లు కొల్లగొట్టింది. అలాగే ఓన్లీ కేరళలో మొట్ట మొదటి రూ. 90 కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ షోస్ తో రన్ అవుతూ రెగ్యులర్ డేస్ లో సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా నేటితో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది. కేవలం నెల వ్యవధి గ్యాప్ లో రెండు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టిన రెండు సినిమాలు కలిగిన హీరోగా మోహన్ లాల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. రూ. 30 తో బడ్జెట్ తో నిర్మించి వందల కోట్లు రాబట్టి కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి రుజువు చేసింది.