ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో 22వ సినిమా.
Also Read : Kayadu Lohar : అరడజను సినిమాలతో యంగ్ బ్యూటీ హల్ చల్
ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 15న ఉస్తాద్ రామ్ పోతినేని బర్త్ డే కనుకగా టైటిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారని సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ టైటిల్ ను అటు సీనియర్ ఎన్టీఆర్ ను ఇటు పవన్ కళ్యాణ్ ను మ్యాచ్ చేసేలా ఉండడంతో రామ్ ఎవరి ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్రంలో సాగర్ అనే క్యారక్టర్ లో నటిస్తున్నాడు రామ్. ఆ మధ్య రిలీజ్ చేసిన రామ్ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. సున్నితమైన వినోదంతో పాటు మనసును హత్తుకునే కథాంశంతో యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ ద్వయం వివేక్ శివ, మెర్విన్ సోలొమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.