కరోనా సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం “తిమ్మరుసు”. జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రంలో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మజీ, రవి బాబు, అంకిత్, అజయ్ తదితరులు నటించారు. సంగీతం శ్రీచరన్ పాకాల అందించారు. శరణ్ కొప్పిసెట్టి దర్శకత్వం వహించారు. “తిమ్మరుసు”ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ & ఎస్ ఒరిజినల్స్ లో మహేష్ ఎస్ కోనేరు, శ్రీజన్ యరబోలు సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Read Also : “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేసిన అలియా
యంగ్ టైగర్ చేతుల మీదుగా “తిమ్మరుసు” ట్రైలర్ ను జూలై 26 న సాయంత్రం 4:50 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో ట్రైలర్ విడుదల గురించి చిత్రబృందం ఆతృతగా ఉన్నారు. తారక్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” మూవీతో పాటు “ఎవరు మీలో కోటీశ్వరులు” షూటింగులలో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ “తిమ్మరుసు” టీజర్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం విశేషం. కాగా ఇంతకు ముందు “తిమ్మరుసు” నుంచి రిలీజ్ అయిన వీడియో సాంగ్, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది.