ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. సుమారు 100 మంది ఇతర భాషల జర్నలిస్టులను ఆహ్వానించి, సినిమా కోసం సిద్ధం చేసిన స్పెషల్ హవేలీ సెట్‌ను చూపించారు.
Also Read:Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’కు కొత్త డేట్?
అజీజ్ నగర్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన కొత్త స్టూడియోలో ఈ హవేలీ సెట్ నిర్మించారు. దీని కోసం 9 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇది పూర్తిగా ఇండోర్ సెట్. ఈ సెట్‌కు సంబంధించిన ఎక్స్టీరియర్ అంతా అల్యూమినియం ఫ్యాక్టరీలో మరో సెట్ వేశారు.
ఇక ఈ ఇంటీరియర్ సెట్ విషయానికి వస్తే, ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ సెట్‌గా నిలుస్తోంది. 41,256 చదరపు అడుగులతో, సినిమాకు సంబంధించిన మేజర్ పోర్షన్ అంతా ఈ సెట్లోనే పూర్తి చేశారు. ప్రభాస్ సహా మిగతా పాత్రధారులు అందరూ ఈ షూట్లో పాల్గొన్నారు.
Also Read:Hanuman Junction: ‘హనుమాన్ జంక్షన్’ మళ్లీ వస్తోంది!
ఇక దీనికి సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్స్ అదనంగా ఆడ్ చేయాల్సి ఉంది కాబట్టి, షూట్‌కు ఇంకా సమయం పడుతుంది. అలాగే, మారుతి ఇంకా టాకీ పార్ట్ పూర్తి చేయాల్సి ఉందని, అలాగే పాటలు కూడా షూట్ చేయాల్సి ఉందని వెల్లడించారు. అయితే, రిలీజ్‌కు ముందే ఇలా మీడియాకు చూపించడం ఒక రకంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే, ఏ సినిమా టీమ్ అయినా, సినిమా రిలీజ్ అయ్యే వరకు తమ ప్రాపర్టీ అంతా తమ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌గా భావిస్తూ ఉంటుంది. కానీ, గతంలో మనోజ్ హీరోగా వచ్చిన ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ అనే సినిమా కోటను కూడా మీడియాకు చూపించారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని మరోసారి ఈ సినిమాకు ఫాలో అవ్వడం గమనార్హం.