కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి అడుగు పెట్టి చాల కాలం అవుతోంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసాడు కానీ SR కళ్యాణమండపం ఒక్కటే సాలిడ్ హిట్. రొటీన్ మాస్ కథలతో సినిమాలు చేయడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. తత్వం బోధపడి కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొత్త కథలు వినే పనిలో ఉన్నాడు ఈ హీరో.
తాజాగా దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ఓ చిత్రన్ని ప్రారంభించాడు ఈ హీరో. తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి “క” అనే టైటిల్ ను ప్రకటించాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ దఫా హిట్టు కొట్టి తీరాలనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం.
ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమాన్ని ఈ నెల 14న AAA మల్టీప్లెక్స్ లో ఉదయం 11:10 గంటలకు నిర్వహించనున్నారు. ట్రైలర్ వచ్చాక థియేట్రికల్ బిజినెస్ కు పోటీ ఉంటుందని సినీ వర్గాలు చర్చికొంటున్నాయి. ఇప్పటికే ట్రైలర్ ను వీక్షించిన కొందరు విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘ క ‘ ఉండబోతుందని అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కొనుగోలు చేసేందుకు బేరాలు సాగిస్తున్నట్టు టాక్. చివరికి ఎవరు దక్కించుకుంటారో చూడాలి. కాగా ఈ హీరో తన మార్కెట్ పరిధికి మించి భారీ బడ్జెట్ తో ‘క’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Sri vishnu : శ్రీ విష్ణుది చూసి ఆశ్చర్యపోతున్న సినీ వర్గలు…ఇంతకీ ఏమిటది…?