సెప్టెంబర్ 5న పెద్ద ఫెస్టివల్ లేదు కానీ ఈ డేట్‌పై నార్త్ టూ సౌత్ సినిమాలు ఇంట్రస్ట్ చూపించాయి. అందులోనూ పాన్ ఇండియా చిత్రాలు ఘాటీ, మదరాసి మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. సౌత్‌లో వీరిద్దరిలో ఒకరు డామినేట్ చూపిస్తారు అందులో నో డౌట్. కానీ నార్త్‌లో టూ ఫిల్మ్స్ బాఘీ4, ది బెంగాల్ ఫైల్స్‌కు పోటీగా ఈ సినిమాలు రిలీజౌతున్నాయి. అనుష్క, క్రిష్ కాంబోలో వస్తోన్న సెకండ్ ఫిల్మ్ ఘాటీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 5నే బరిలోకి దిగుతోంది. అనుష్క ప్రమోషన్లలో నేరుగా పాల్గొనకపోయినా.. ఫోన్ చిట్ చాట్స్ ద్వారా తన వంతు ప్రయత్నం చేస్తోంది.
Also Read : Pawan Kalyan : ‘పవర్ స్టార్’ పోస్టర్ కు మిక్డ్స్ రెస్పాన్స్.. చాలానే చూసాం
అనుష్క రాకను గమనించిన తేజా సజ్జా సైడిస్తే సడెన్లీ రేసులోకి వచ్చింది చిన్న ఫిల్మ్ లిటిల్ హార్ట్స్. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో పాపులరైన మౌళి, శివానీ నాగారం నటించిన ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 5కి ప్రీ పోన్ చేసుకుంది. సౌత్ సినిమాలను పట్టుకెళ్లి వాటిని రీమేక్స్ చేసి బాఘీ ఫ్రాంచైజీ అంటూ కలరింగ్ ఇచ్చి హిట్స్ అందుకుంటోన్న టైగర్ ష్రాప్ ఇప్పుడు మరింత వయెలెంట్ ఫిల్మ్ బాఘీ4 చేస్తున్నాడు. ఇది కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ కాబోతుంది. హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ ఫిల్మ్ తో కన్నడ డైరెక్టర్ హర్ష బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదే రోజు దీనికి పోటీగా కాంట్రవర్సియల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి నుండి ది బెంగాల్ ఫైల్స్ రాబోతుంది. వీటికే స్పేస్ లేదనుకుంటే హాలీవుడ్ ఫిల్మ్ ది కంజురింగ్ ది లాస్ట్ రైట్స్ కూడా డబ్బింగ్ వర్షన్ లో దండయాత్ర చేస్తుంది. మరీ ఇన్ని సినిమాల్లో ఎవరు గెలుస్తారో ఎవరూ ఓడిపోతారే సెప్టెంబర్ 5 రోజు తెలుస్తుంది.