పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ను ప్రమోషన్స్ హడావిడి ముగిసిన వెంటనే గ్యాప్ లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఈ పోస్టర్ పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు వింటేజ్ పవర్ స్టార్ లుక్ లో సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు అంటే మరి కొందరు ఈ పోస్టర్ లాంటివి గతంలో అనేక మంది హీరోల సినిమాల నుండి వచ్చాయి కొత్తదనం ఏమి లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ నటించిన బ్రో సినిమాలో కూడా పవర్ స్టార్ ఇంచు మించు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్నట్టే ఉంటారు. ఏదైతేనేం సినిమా బాగుంటే అదే చాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బంద్ వలన కాస్త డిలే అయిన ఉస్తాద్ షూటింగ్స్ తిరిగి స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ షూట్ ను చక చక ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుమాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి హరీష్ శంకర్ ఎలా తెరకెక్కిస్తున్నాడో.