Praneeth Hanumanthu Arrested in Bangalore: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక చర్చలకు కారణంగా నిలిచిన యూట్యూబర్ కం నటుడు ప్రణీత్ హనుమంతు అరెస్టు అయినట్లుగా తెలుస్తోంది. పి హనుమంతు అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రణీత్ హనుమంతు తండ్రి కూతుళ్లు కలిసి ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో రోస్ట్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కూతుళ్ళ బంధానికే మచ్చ తెచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. సాయిధరమ్ తేజ్ మొదలు మంచు మనోజ్ సహా అనేకమంది తెలుగు హీరోలు ఈ విషయం మీద స్పందిస్తూ చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా స్పందిస్తూ అతని మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Bharateeyudu 2: తెలంగాణాలో భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంపు ఎంతంటే?
అంతేకాదు తెలంగాణ డిజిపి అతని మీద కేసు నమోదు అయినట్లు కూడా వెల్లడించారు. ఇక అతను అరెస్టు అయ్యాడా లేదా అనే విషయం మీద ఇప్పటివరకు సందిగ్దత కొనసాగుతూ వచ్చింది. కానీ తాజాగా ప్రణీత్ ని బెంగళూరులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసి అతని ఇప్పుడు హైదరాబాద్ తరలిస్తున్నారు. పీటీ వారెంట్ మీద అతన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకురానున్నారు. సైబర్ సెల్ లో నమోదైన కేసు మీద అతన్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మరికొన్ని చోట్ల కూడా అతని మీద కేసులు నమోదైన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్ కుమారుడని తెలుస్తోంది. అలాగే అయ్ జ్యూడ్ అనే మరో యూట్యూబ్ ఫ్యాషన్ ఛానల్ నిర్వాహకుడి సోదరుడుగా చెబుతున్నారు. ప్రణీత్ హనుమంతు ఇటీవల హరోం హర అనే సినిమాలో నటించాడు. అయితే అతను ఇలాంటి వాడని తెలియక తమ సినిమాలో తీసుకున్నామని హీరో సుధీర్ బాబు అన్నారు.