OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఎంతో బిజీ గా వున్నారు.తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన పూర్తి ఫోకస్ రాజకీయాలపై ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో పవన్ కల్యాణ్ మళ్ళీ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ లో బిజీ కానున్నారు.పవన్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”..ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.పవన్ కల్యాణ్ మళ్ళీ జూన్ నుంచి “ఓజి” షూటింగ్ లో పాల్గొననున్నారు.
Read Also :Naga Vamsi : జూన్ 10 న బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే..
ఇదిలా ఉంటే హీరో కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “భజే వాయు వేగం” మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుజీత్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసారు.ఓజి అంటే ఓజాస్ గంభీర అని అర్థమని సుజీత్ తెలిపారు.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గారు చేసే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సుజీత్ తెలిపారు.అలాగే ఓజాస్ అంటే మాస్టర్ అని గంభీర అంటే పవన్ క్యారెక్టర్ పేరు అని సుజీత్ తెలిపారు.ఈ చిత్రం ట్రైలర్ కూడా రెడీ అయిందని సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ చేస్తామని సుజీత్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తమన్ ఇప్పటికే హంగ్రీ చీతా అంటూ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్ ఇప్పుడు మరో మాస్ ఫీస్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఓజి నుంచి త్వరలోనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయనునట్లు సమాచారం.