Chiranjeevi : విజయ్ తండ్రితో సూపర్ హిట్లు కొట్టిన చిరంజీవి
వెండితెరను ఏలిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన ప్రభంజనాన్ని చాటుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఉన్న విడదీయలేని సినిమా బంధం గురించి ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన తెలుగు సినీ ప్రయాణం మెగాస్టార్ చిరంజీవితోనే ప్రారంభం కావడం విశేషం.
తమిళంలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన చంద్రశేఖర్‌ను నమ్మి, చిరంజీవి ఆయనకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. 1981లో వచ్చిన ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పింది. తెలుగులో చంద్రశేఖర్ దాదాపు అరడజను సినిమాలు చేసినప్పటికీ, ఆయనకు భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందించింది మాత్రం చిరంజీవి సినిమాలే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలిచాయి. చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు. తండ్రి పేరుతో పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, దళపతి విజయ్ తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడిగా విజయ్ గుర్తింపు పొందారు. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
Also Read
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..
-
Chiranjeevi : విజయ్ తండ్రితో సూపర్ హిట్లు కొట్టిన చిరంజీవి
-
Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
-
Exit Polls Failed: సర్వేలకు అందని ఓటర్ నాడి.. తలకిందులైన ఎగ్జిట్ పోల్స్..
-
CM MK Stalin Loses: సీఎం ఓడిపోయాడు.. తమిళ రాజకీయ చరిత్రలో సంచలనం
-
Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!