Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది మాత్రం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఒక పవర్ఫుల్ పాత్రలో, అదిరిపోయే స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో తెరపై తళుక్కున మెరిసిన హృతిక్ రోషన్.. రజనీకాంత్‌తో కలిసి కనిపించగానే థియేటర్లలో ఈలలు, గోలలతో రచ్చ లేచిపోయింది. అయితే, స్క్రీన్‌పై కనిపించింది కేవలం ఐదారు నిమిషాలే అయినప్పటికీ, ఈ చిన్న క్యామియో కోసం హృతిక్ తీసుకున్న పారితోషికం గురించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హృతిక్ రోషన్ రెమ్యునరేషన్‌పై ఒకటే చర్చ నడుస్తోంది. కేవలం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల నిడివి ఉండే స్పెషల్ అపియరెన్స్ కోసం హృతిక్ ఏకంగా రూ.25 కోట్లు ఛార్జ్ చేశాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నిమిషానికి దాదాపు రూ. 4 నుంచి 5 కోట్ల లెక్కన ముట్టజెప్పారని వస్తున్న ఈ రూమర్స్ సినీ ప్రియుల మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. రజనీకాంత్ అంటే హృతిక్‌కు విపరీతమైన గౌరవం ఉందని, అలాంటిది డబ్బుల కోసం ఈ పాత్ర చేశాడనడం అవాస్తవమని వాదిస్తున్నారు. గతంలో ‘కూలీ’ సినిమాలో నటించిన అమీర్ ఖాన్ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే రాగా.. రజనీకాంత్ కోసం ఫ్రీగానే నటించానని, తలైవర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే తనకు దక్కిన అతిపెద్ద గిఫ్ట్ అని అమీర్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
Also Read
- Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
- Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
ఈ స్పెషల్ క్యామియో వెనుక మరో ఆసక్తికరమైన కథ నడిచింది. మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణను సంప్రదించారట. అయితే బాలయ్య సున్నితంగా తిరస్కరించడంతో ఈ ఆఫర్ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దగ్గరకు వెళ్లింది. ‘కింగ్’ సినిమా లుక్ ముందే బయటకు రాకూడదన్న ఉద్దేశంతో షారుక్ కూడా నో చెప్పడంతో, చివరకు నెల్సన్ ఈ క్రేజీ రోల్ కోసం హృతిక్ రోషన్‌ను రంగంలోకి దించారని సమాచారం. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’, ‘వార్ 2’ చిత్రాలతో నువ్వా-నేనా అంటూ తలపడిన రజనీకాంత్, హృతిక్ రోషన్.. సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ‘భగవాన్ దాదా’ చిత్రంలో రజినీకాంత్‌తో కలిసి హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం వల్లే నెల్సన్ అడగ్గానే హృతిక్ కాదనలేకపోయారని తెలుస్తోంది. కారణాలు ఏవైనా, ‘జైలర్ 2’లో రజినీ – హృతిక్ కాంబో మాత్రం థియేటర్లలో పక్కా పైసా వసూల్ మూమెంట్‌గా నిలిచింది.
తాజావార్తలు
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!