యునైటెడ్ స్టేట్స్‌లో బ్లైండ్ క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో, నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ (NASAA) సియాటిల్‌లో ఇండియా నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, సీయాటిల్ థండర్‌బోల్ట్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ముఖ్య అతిథిగా పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు.
Also Read : NBGM : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందా..?
సియాటిల్‌లో ఆతిథ్యం ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్‌కు అంధుల క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మహంతేష్ కృతజ్ఞతలు తెలిపారు. పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. థండర్ బోల్ట్స్ అధినేత ఫణి చిట్నేని మాట్లాడుతూ.. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదని, భారతీయులకు భావోద్వేగమని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా, వాషింగ్టన్ సెనేటర్ డెరిక్, హౌస్ రిప్రజెంటేటివ్ వందన స్లేటర్, భాస్కర్ గంగిపాముల, రామ్ పాలూరి, విక్రమ్ గార్లపాటి, రవీందర్ రెడ్డి సాధు, జైపాల్ రెడ్డి, రవీంద్ర గురం, సుబ్బారావు కలగర, సుబ్బు కందకట్టు, వెంకట్ చిలకల, వెంకట్ చిలకలపాటి, అశోక్ గల్లా, నంద గాజుల తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వాలంటీర్లు సుంకరి శ్రీరామ్, వెంకటేష్ అత్తిపల్లి, రామ్ ఉగ్గిరాల, రాకేష్ కోనాడ, వినోద్ పర్ణ, రాజశేఖర్ చౌదరి, శ్రీకాంత్ మొగరాల, సోమ జగదీష్, జనార్దన్ చెక్క, శశి యజ్జు, మారుతి ఎక్కలి, వెంకట్ కనుమూరి, సతీష్ గొట్టుముక్కల తదితరులు ఉన్నారు.