Telegu film chamber meeting today evening
గత 18 రోజులు గా తెలుగు సినిమా షూటింగ్ లు బంద్ కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఛాంబర్ సమావేశం నిర్వహించనున్నారు. అయితే.. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి 33మందితో ఫిలింఛాంబర్ కమిటీ ఏర్పాటుచేసింది. తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీ ప్రధానంగా నాలుగు ఓ టి టి, టిక్కెట్ ధరలు, వి పి ఎఫ్ ఛార్జీలు, నిర్మాణ వ్యయం అంశాలపై చర్చలు జరుపారు. అయితే.. ఆగస్టు 1న ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపింది ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ. జూనియర్ ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్, కార్మికుల వేతనాలు, షూటింగ్స్ టైమ్ పై చర్చలు జరిపారు. ఆగస్ట్ 3న ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల తో చర్చలు జరిపారు. షూటింగుల నిలుపుదల, ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ లు, డైలీ పేమెంట్ ఆర్టిస్టులు, ఆర్టిస్టుల స్టాఫ్ ఖర్చులు తదితర అంశాలపై చర్చించారు. ఆగస్ట్ 4న మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ కమిటీ సమావేశం అయ్యింది.
టికెట్ ధరలు, తినుబండరాలు, వసతులపై మల్టీఫ్లెక్స్ ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ కమిటీ చర్చలు జరిపారు. ఆగస్ట్ 5 ఫిలిం ఛాంబర్ లో కమిటీ…అధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ ప్రధాన సమస్యలపై చర్చించింది. ఆగస్ట్ 7న దర్శకులతో, డిస్ట్రిబ్యూటర్ ల తో వేరు వేరుగా కమిటీ సమావేశం అయ్యింది. నిర్మాణ వ్యయాల తగ్గింపు, కథల ఎంపిక, షూటింగ్ షెడ్యూల్స్, నటీనటుల పారితోషకాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. డిస్ట్రిబ్యూటర్ల తో థియేటర్లలో రెవెన్యూ వాటాలు, వీపీఎఫ్ ఛార్జీలపై చర్చ జరిగింది. అందరితో చర్చలు సామరస్య పూర్వకంగా జరిగినట్టు కమిటీ సభ్యులు చెప్పారు. వచ్చేవారంలో అగ్ర హీరోల సినిమాల చిత్రీకరణలు మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ , నాని, రవితేజ చిత్ర యూనిట్స్ షెడ్యూల్ వేసుకున్నట్లు సమాచారం.