Site icon NTV Telugu

NTV Exclusive: మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్న టాలీవుడ్ కమెడియన్?

Director Shill

Director Shill

సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు.

Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే?

కొన్ని సినిమాలు చేశారు కానీ అవేవీ కలిసి రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా మారబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందులో ఎంత నిజం ఉందో ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు మరో కమెడియన్ ఒక సీరియస్ సబ్జెక్ట్ రాసుకున్నాడని, దాంతో దర్శకుడిగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. యంగ్ హీరోస్ ఒకరిద్దరిని ఈ మేరకు కథ వినమని కోరినట్లు తెలుస్తోంది. కథ విన్నవారు అదిరిపోయిందని అంటున్నారు. ఒకవేళ యంగ్ హీరోస్‌లో ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సదరు కమెడియన్ దర్శకుడిగా మారే అవకాశం ఉంది.

Exit mobile version