సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు…
(సెప్టెంబర్ 20న ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి) తెరపై ధర్మవరపు సుబ్రహ్మణ్యం కనిపించగానే ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. తాను నటించిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఓ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆయన నవ్వులు పూయించారు. ఆయన నవ్వుల నటనకు నంది అవార్డులూ లభించాయి. బుల్లితెరపైనా తన సంతకం చేస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ‘తోకలేని పిట్ట’తో దర్శకునిగానూ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘానికి అధ్యక్షునిగానూ వ్యవహరించారు. ‘శోభన్ బాబు రింగు’ అంటూ నుదుటన జుత్తును రింగులా…