సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు…
“కళ్ళ కింద క్యారీ బ్యాగులు…” ఉంటేనేం, కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు, నందులు నడచుకుంటూ రావలసిందే! అంతటి ధీమాతోనే ఎమ్.ఎస్.నారాయణ నవ్వులు పూయించారు. అందువల్లే ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డులు వరించాయి. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే! పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో 1951…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…