తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, సుప్రియ, బాపినీడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ కార్మికుల సమ్మె, షూటింగ్‌ల నిలిపివేత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.
Also Read : Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో ముగిసిన నిర్మాతలు భేటీ.. నంది అవార్డ్స్ పై కీలక ప్రకటన
సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు కోరుతూ సమ్మె బాట పట్టడంతో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో చర్చలు విఫలమవడంతో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి దిల్ రాజుకు బాధ్యత అప్పగించినట్లు ఆయన తెలిపారు.
Also Read :Tollywood : డివోషనల్ టచ్ తో వస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు.. హిట్ దక్కుతుందా.?
మెగాస్టార్ చిరంజీవి కూడా మధ్యవర్తిత్వం వహిస్తూ, సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్‌తో చిరంజీవి సమావేశమయ్యారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే తాను స్వయంగా జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.