Telangana Government Will do Krishnam Raju Funeral Rites: రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్ ఏర్పాట్లు చేస్తున్నారు. యూసుఫ్‌గూడ లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియానికి కృష్ణంరాజు పార్దీవదేహాన్ని వుంచనున్నారు. అభిమానులు చూసేందుకు వీలుగా వుంటుందని ఈనిర్ణయం తీసుకున్నాట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.
సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్ లో ఇవాళ తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు కృష్ణంరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు తెలుగు సినీరంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు కృష్ణంరాజు.
Nandamuri Balakrishna: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది