తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్‌హీరో ఇమేజ్‌ను నిజం చేస్తున్న హీరో తేజ సజ్జా మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. తేజ సజ్జా తాజా చిత్రం ‘మిరాయ్’ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను దాటింది. ఇంత త్వరగా ఈ మైలురాయిని సాధించిన తేజ సజ్జా రెండో సినిమా ఇది. ఇంతకుముందు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ ఈ రికార్డును సృష్టించింది. మిరాయ్ చిత్రం తన నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తూ, ట్రేడ్ సర్కిల్స్‌లో గుర్తింపును సంపాదించింది.
Also Read : Bhadrakali: భద్రకాళి లాంటి పోలిటికల్ థ్రిల్లర్ ఇప్పటివరకూ రాలేదు
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ‘మిరాయ్’ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, బుక్‌మైషో సైట్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. మంగళవారం ఒక్కరోజులోనే 1 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా $2 మిలియన్ల మార్క్‌ను దాటి, తేజ సజ్జా రెండో చిత్రంగా చరిత్ర సృష్టించింది. ముఖ్య విలన్ పాత్రలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తేజ తల్లి పాత్రలో శ్రీయా శరణ్ భావోద్వేగాలను సమర్థవంతంగా చూపించింది. లార్జర్-దాన్-లైఫ్ స్టోరీటెల్లింగ్, స్పెక్టాక్యులర్ విజువల్స్‌తో ‘మిరాయ్’ రిపీట్ వాల్యూ కలిగిన చిత్రంగా నిలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌కు దిశగా సాగుతోంది. రెండో వీక్‌లో పెద్ద పోటీ లేకపోవడంతో, ట్రేడ్ అనలిస్టులు మరిన్ని రికార్డులు బద్ధలవుతాయని అంచనా వేస్తున్నారు.