Bhadrakali: భద్రకాళి లాంటి పోలిటికల్ థ్రిల్లర్ ఇప్పటివరకూ రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడం ఎలా అనిపిస్తుంది?
-విజయ్ ఆంటోనీ గారు నేను ఎప్పటినుంచో మంచి మిత్రులం. విజయ్ ఆంటోనీ ఫిలిం ఫ్యాక్టరీ, మా బ్యానర్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ కలిపి కొన్ని మూవీస్ చేయాలని ప్రయాణం మొదలుపెట్టాం. మార్గాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భద్రకాళి సెప్టెంబర్ 19 రిలీజ్ కాబోతుంది.
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-ఇటీవలే బూకి అనే సినిమాని మొదలుపెట్టాం. మలయాళం లో ఒక సినిమా చేస్తున్నాం. అది చివరి దశకు వచ్చింది. మా రెండు బ్యానర్స్ లో ఇంకొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేస్తాం. బిచ్చగాడు డైరెక్టర్ శశి, విజయ్ ఆంటోని గారి కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్టు ఉంటుంది. తొందరలో అది అనౌన్స్ చేస్తాం. మేము విజయ్ ఆంటోని గారు కలవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తున్నాము. మా నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి.
భద్రకాళి ఎలా మొదలైంది?
-డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు కథ చెప్పారు. చాలా బాగుంది. డైరెక్టర్ గారు అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. భద్రకాళి సినిమాకి అరుణ్ బాబు గారు ఒక బ్యాక్ బోన్. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలు కూడా ఉన్నాయి. సినిమా అంత అద్భుతానికి రావడానికి కారణం డైరెక్టర్ గారి విజన్.
-సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది విజయ్ ఆంటోనీ గారికి 25వ సినిమా అవ్వడం కూడా కలిసి వచ్చింది. మంచి బడ్జెట్ అద్భుతమైన కంటెంట్ తోవస్తున్న సినిమా ఇది. తమిళ్ తెలుగు కన్నడ హిందీలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం.
-సినిమాకి భద్రకాళి అనే టైటిల్ పెట్టాము. సరిగ్గా దసరా నవరాత్రులు సమయంలోనే ఈ సినిమా రావడం కలిసి వచ్చిందని మార్గాన్ సినిమాని రిలీజ్ చేసిన మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. మార్గన్ కంటే ఈ సినిమాకి 20% థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. వారు ఆ మాట చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ట్రైలర్ చూస్తే ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అనిపిస్తుంది? కథ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది?
-పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాలో హీరో గారు చేసిన క్యారెక్టర్ తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి హీరో క్యారెక్టర్ తో ఇప్పటివరకు సినిమా రాలేదు.
-సినిమాలో చాలా మంచి స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆడియన్స్ కి డెఫినెట్గా కనెక్ట్ అవుతాయి. సమాజంలో జరుగుతున్న విషయాల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అందరూ పర్సనల్ గా కనెక్ట్ అవుతారు.
ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏమిటి?
-చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిందని కంటే సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. విజయ్ గారి క్యారెక్టర్స్ అన్నీ నేచురల్ గా ఉంటాయి. ఇందులో కూడా తన పాత్ర ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అవుతుంది.
-పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. డైరెక్టర్ గారి విజన్ కి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేశాం. డైరెక్టర్ గారికి క్రియేటివ్ గా ఫ్రీడమ్ ఇచ్చాము.
భద్రకాళిలో హైలెట్స్ గా ఉండే ఎలిమెంట్స్ ఏమిటి?
-చాలా గ్రిప్ ఉన్న స్టోరీ ఇది. ఇందులో ప్రతి సీన్ ఆడియన్స్ ని హత్తుకుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు.
-విజయ్ ఆంటోని గారు ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కి చాలా మంచి రీచ్ వచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
వరుసగా సినిమాలు చేయడానికి మార్గన్ విజయం మీకు జోష్ ఇచ్చిందా?
-మార్గాన్ కి ముందు దాదాపు 11 సినిమాలు చేశాను. తమిళ్లో చాలా పెద్ద లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ చేశాం. అయితే కోవిడ్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత విజయ్ ఆంటోనీ గారితో రీ కనెక్ట్ అవడంతో మళ్లీ సినిమాల వరుసగా చేయాలని ప్లాన్ చేశాం.
తెలుగులో చేస్తున్న సినిమాలు ఉన్నాయా?
-తెలుగులో సత్యదేవ్ గారితో ఫుల్ బాటిల్ అనే సినిమా చేస్తున్నాం. అది కంప్లీట్ అయి రెడీగా ఉంది. నవంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
- Tags
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?