తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్‌హీరో ఇమేజ్‌ను నిజం చేస్తున్న హీరో తేజ సజ్జా మరోసారి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. తేజ సజ్జా తాజా చిత్రం ‘మిరాయ్’ కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను దాటింది. ఇంత త్వరగా ఈ మైలురాయిని సాధించిన తేజ సజ్జా రెండో సినిమా ఇది. ఇంతకుముందు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ ఈ రికార్డును సృష్టించింది. మిరాయ్ చిత్రం తన నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తూ, ట్రేడ్ సర్కిల్స్‌లో…