హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది.
Also Read : Vishwak Sen : నువ్వు రంకి రెడ్డి అయితే నేను ‘రంకు రెడ్డి’
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. మిరాయ్ యూనిట్ ఇటీవల శ్రీలంక షెడ్యూల్ లో షూట్ చేస్తోంది. హీరో తేజపై యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేస్తున్నారు. అందుకు సంబందించి రెండు రోజుల క్రితం ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో ఎటువంటి డూప్ లేకుండా ట్రైన్ పై యాక్షన్ సీక్వెన్స్ లో తేజా సజ్జా ఫైట్స్ చేస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా హీరో తేజా సజ్జా శ్రీలంక షెడ్యూల్ ముగించి హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుండి వస్తున్న విజువల్స్ లో తేజా ఎడమ చేతికి కట్టుతో కనిపించాడు. ఈ విషయమై ఆరా తీయగా మిరాయ్ షూట్ లో తేజ సజ్జా గాయపడినట్టు తెలుస్తోంది. చిన్న గాయమేనని త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ లో తేజా పాల్గొననున్నాడు. మిరాయ్‌ని 8 భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల కానుంది.
#Mirai శ్రీలంక షెడ్యూల్ పూర్తి !
చేతికి గాయంతో @tejasajja123 https://t.co/WVxTk17uKv pic.twitter.com/38qQ8xZKxK
— Rajesh Manne (@rajeshmanne1) October 20, 2024