యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా తీసుకునే హీరోల జాబితాలో చేరిపోయాడు. తేజ సజ్జ తన తరువాత సూపర్ హీరో మూవీ కోసం ఏకంగా కోటి రూపాయలను రెమ్యూనరేషన్ గా పుచ్చుకుంటున్నట్టు సమాచారం.
Read Also : షూటింగ్ రీస్టార్ట్ చేసిన “పుష్ప” టీం
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవలే “హనుమాన్” ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి ఇండియన్ సూపర్ మూవీలో హీరోగా తేజ సజ్జను ప్రకటిస్తూ ఇటీవలే సినిమాను ప్రారంభించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. భారీ విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రం రూపొందనుంది. తేజకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమా సాటిలైట్, డిజిటల్ రైట్స్ కు డిమాండ్ ఉంది. ఇటీవలే వచ్చిన “జాంబీ రెడ్డి”తో అది నిరూపితమయ్యింది. ప్రస్తుతం ఈ హీరో రెమ్యూనరేషన్ విషయం చర్చనీయాంశంగా మారింది. తేజ తాను నటించిన “ఇష్క్” మూవీ విడుదల గురించి ఎదురు చూస్తున్నాడు.