కథ, కథనాలు కొత్తగా ఉంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి. అలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తుంది. అందుకే ఇప్పటి దర్శక నిర్మాతలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా వస్తున్న సినిమాల్లో వెరీ స్పెషల్‌గా చెప్పుకునే సినిమా ఒకటి రాబోతున్నది అదే మరో ప్రస్థానం. తనీష్ హీరోగా వస్తున్న ఈ సినిమా రియల్ టైమ్‌లోనే రీల్ టైమ్ ఉంటుంది. అంటే షాట్ టు షాట్ అన్నమాట. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే, సరిగ్గా అదే టైమ్‌కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాట్రన్‌లో షూట్ చేశారు. ఇలాంటి కట్స్, రివైండ్ షాట్స్ లేకుండా సినిమాను కంప్లీట్ చేయడం విశేషం. సినిమా మొత్తం స్ట్రైట్ స్క్రీన్‌ప్లేతో రన్ అవుతుంది. జానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిమాలయ స్టూడియో మాన్షన్, మిర్త్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ నెలాఖరుకు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.