మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడూ ఐటెం సాంగ్స్ లోనూ మెరుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం తమన్నా మెగా హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. స్పోర్ట్ బేస్డ్ డ్రామా “గని”లో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఒక ప్రత్యేక పాట ఉందట. ఆ సాంగ్ లో తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
Read Also : ప్రముఖ నటికి కారు ప్రమాదం… స్నేహితురాలు మృతి
ఇంతకుముందు వరుణ్ తేజ్, తమన్నా “ఎఫ్ 2: ది ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్”లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం వారు “ఎఫ్ 2″కి సీక్వెల్ అయిన “ఎఫ్ 3” కోసం కలిసి పని చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ “గని”లో బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. బి టౌన్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు ఈ చిత్రంలో ఉపేంద్ర, బాలీవుడ్ తారలు సునీల్ శెట్టి కూడా ఉన్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు.