Odela 2 : అక్కడ కూడా ‘ఓదెల 2’ను ప్రమోట్ చేయనున్న తమన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్ట్ OTT లో విడుదలై త్రిల్లింగ్ మూవీగా ఆకట్టుకున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. 2022 లో వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్ర పోషించగ కథ ప్రకారం ప్రేక్షకును ఈ మూవీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్‌గా ‘ఓదెల-2’ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read: AI Movie: మొదటి భారతీయ ‘ఏఐ’ మూవీ పరిచయం చేసిన చిత్రబృందం.
Also Read
ఇటివల ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ మహాకుంభ మేళాలో విడుదల చేయగా, ఇందులో తమన్నా లేడీ అఘోరాగా కనిపించింది. ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో ప్రతి ఒక సీన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ అధిరిపొయింది. యూట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ సంపాదించుకుంది. అక్కడ వరుస చిత్రాలు, సిరీస్ లు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ క్రేజ్ ని ‘ఓదెల 2’ కి ఉపయోగించుకోనుంది తమన్నా.
ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ‘ఓదెల 2’ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఈ సినిమాను హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం హిందీ రైట్స్ ఏకంగా రూ.8 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. కాగా బాలీవుడ్లో ఈ మూవీని తమన్నా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతుందట. అక్కడ ఆమెకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ను ఈ సినిమా కోసం వినియోగించుకోనున్నారట.
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?