బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇటీవల పారితోషికం విషయంలో తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ భారీ పౌరాణిక చిత్రంలో ‘సీత’ పాత్రను పోషించడానికి కరీనా తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా డబుల్ అమౌంట్ డిమాండ్ చేసిందనే వార్తలు రావడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. కరీనా రెమ్యూనరేషన్ 6-8 కోట్లు. అయితే ఆమె సీత పాత్ర కోసం 12 కోట్ల రూపాయలకు పారితోషికంగా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏకంగా బ్యాన్ కరీనా కపూర్ ఖాన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసి తమ కోపాన్ని చూపించారు. అంతేకాదు సీత పాత్ర కోసం ముస్లిమ్ గా కన్వర్ట్ ఆయిన కరీనాను అస్సలు తీసుకోవద్దని, ఆ పాత్రకు కంగనా రనౌత్ అయితే బాగా సెట్ అవుతుందని మేకర్స్ కు సోషల్ మీడియా ద్వారా సలహాలు కూడా ఇచ్చారు నెటిజన్లు. అయితే ఈ విషయంపై బెబో ఇంత వరకూ నోరు మెదపలేదు. కానీ మిల్కీ బ్యూటీ తాప్సి మాత్రం ఆమె సీత పాత్ర కోసం అంత డిమాండ్ చేయడంలో తప్పేముంది ? అని ప్రశ్నిస్తోంది.
Read Also : లైంగిక వేధింపుల కేసులో నటుడికి విముక్తి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ “కరీనా దేశంలోనే అతి పెద్ద ఫిమేల్ సూపర్ స్టార్లలో ఒకరు. ఆమె తాను చేస్తున్న పనికి శాలరీ అడుగుతోంది. ఒక హీరో తన పారితోషికాన్ని పెంచినప్పుడు ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఒక హీరోయిన్ రెమ్యూనరేషన్ పెంచేటప్పటికీ ఎందుకింత రచ్చ ? హీరోయిన్లు రెమ్యూనరేషన్ పెంచితే డిమాండ్ అంటారు. మరి భారీ పౌరాణిక చిత్రాల్లో హీరోలు ఫ్రీగా నటిస్తున్నారా ?” అని ఫైర్ అవుతూ బెబోకు తన మద్దతు ప్రకటించింది తాప్సి. ఇక ఈ బ్యూటీ వినిల్ మాథ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన “హసీన్ దిల్‌రూబా”లో కనిపించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే కూడా నటించారు. ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుంది. ఇంకా తాప్సి ఖాతాలో రష్మి రాకెట్, వోహ్ లడ్కి హై కహాన్, శభాష్ మిథు కూడా ఉన్నాయి. మరోవైపు అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’లో కరీనా కనిపించనుంది.