కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘గజిని’ మూవీ తో మొదలు ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రజంట్ సూర్య వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్‌లో తండ్రి శివ కుమార్ సూర్య గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Raj Tarun : లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్
‘ కెరీర్ ఆరంభం నుంచి మా అబ్బాయి ఎంతో కష్టపడ్డాడు. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒకానొక సమయంలో దాదాపు నాలుగు గంటలపాటు ఆగకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తునే ఉండేవాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచి బీజ్‌కు వెళ్లి స్టంట్స్ నేర్చుకునేవాడు. మీ అందరికీ నిజాయతీగా మరో విషయం చెబుతున్నా. నా తనయుడి కంటే ముందు కోలీవుడ్లో ఎవరూ కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు. సినిమాల కోసం అలాంటి బాడీ ట్రై చేసిన మొదటి వ్యక్తి మా అబ్బాయి. సూర్య విషయంలో నేనెంతో గర్వపడుతున్నా’ అంటూ శివ కుమార్ తెలిపారు. తండ్రి మాటలతో అక్కడే ఉన్న సూర్య చాలా ఎమోషనల్ అవుతూ..
‘జీవితం ఎంతో అందమైంది దానిని నమ్మండి. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే వయసు ఇదే. నేను అయితే అగరం ఫౌండేషన్ కోసం జీవిస్తున్నా ఆ సంస్థ వల్ల సుమారు 8 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్లందరి భవిష్యత్తు కోసం ఎంతైనా శ్రమిస్తా. మే 1న మా సినిమా విడుదల కానుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని తెలిపారు.