Surya : ‘కంగువ’ ఆడియో రీలీజ్ కు ముఖ్య అతిధిగా స్టార్ హీరో..?
- సూర్య కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా కంగువ
- నవంబరు 14న రిలీజ్ కు భారీ ఏర్పాట్లు
- చెన్నై లో గ్రాండ్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు సన్నాహకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా ‘వేట్టయాన్’ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
Also Read : Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ
Also Read
దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు స్టూడియో గ్రీన్ అధినేత కే.ఈ జ్ఞానవేల్ రాజా. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాను నవంబరు 14న వరల్డ్ వైడ్ గ రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. అందులో భాగంగా ఈ చిత్ర ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నట్టు తమిళ వర్గాల సమాచారం. రజనీ నటించిన సినిమా కోసం అప్పటికి విడుదలకు రెడీ గా ఉన్న కంగువను పోస్ట్ పోను చేసుకున్నారు. ఆ కారణంగా రజనీ హాజరయి తనవంతుగా ప్రమోట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కంగువ కు భారీ పబ్లిసిటీ వచ్చినట్టే. మొత్తం 8 భాషల్లో రానున్న కంగువకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!