Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ
- గ్రాండ్ గా లాంఛ్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్ 4
- అదరగొట్టిన బాలయ్య ప్రోమో
- ఈ షో వేరే ఎవరైనా అడిగి ఉంటే చేసేవాడిని కాదు: బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్: ఆహా OTT ప్లాట్‌ఫారమ్, ఎన్‌బికె మోస్ట్ ఎవైటెడ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ను శనివారం అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని సూపర్ హీరో పాత్రలో లెజెండరీ, షో హోస్ట్ నందమూరి బాలకృష్ణను ప్రజెంట్ చేసే అద్భుతమైన ఫస్ట్ లుక్, 3D యానిమేటెడ్ ప్రోమోని లాంచ్ చేసింది.రతన్ టాటాకు నివాళులర్పిస్తూ ఒక క్షణం మౌనం పాటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అల్లు అరవింద్ (ఆహా డైరెక్టర్), అనిల్ రావిపూడి (డైరెక్టర్), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్), అజిత్ ఠాకూర్ (ఆహా డైరెక్టర్), రవికాంత్ సబ్నవిస్ (ఆహా CEO), రాజీవ్ చిలక (గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్) సహా పలువురు ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..అందరికీ దసరా శుభాకాంక్షలు. గెలుపు అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదైతే కొత్తగా అనుకుంటామో ఆ జయం మనల్ని వరిస్తుంది. విజయానికి ప్రతీక ఈ దసరా శరన్నవరాత్రులు. అన్‌స్టాపబుల్ మొదలవడమే ఒక విస్పోటనం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాకు కేవలం తండ్రి గానే కాకుండా గురువుగా దైవంగా భావిస్తాను. ఆయన ఎంతో ముందు చూపుతో వినూత్నమైన చిత్రాలు, అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన స్ఫూర్తి తోనే అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ షో కూడా వేరే ఎవరైనా అడిగి ఉంటే చేసేవాడిని కాదు. కేవలం అరవింద్‌గారి కోసమే ఒప్పుకొన్నా. అన్‌స్టాపబుల్ అండ్ టీమ్ అంతా ఒక కుటుంబ సభ్యులులా పనిచేస్తూ కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితమే అన్‌స్టాపబుల్ సక్సెస్. ఐఎండీబీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఈ షో 18వ స్థానంలో వుంది. మన దేశంలోనే రీజినల్ లాంగ్వేజ్ లో నెంబర్ వన్ షోగా నిలిచింది. ఎంతో మంది హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మొదటి మూడు సీజన్ కి రావడం జరిగింది. వాళ్ళ మనసుల్లో మాటని ఎంతో ఓపెన్ గా పంచుకున్నారు. ఈ షో విజయంలో వారి పాత్ర వుంది. ప్రేక్షకులు ఏది కొత్తగా అనిపించినా దానికి ఆమోదం ముద్ర వేస్తారు. దాన్ని సక్సెస్ చేస్తారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశం ఈ షోకి నీరాజనాలు అందించింది. ఈ సందర్భంగా ప్రేక్షక దేవుళ్లకు, అన్ స్టాపబుల్ టీమ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఈ షోలో భాగం కావడం, స్క్రిప్ట్ రైటర్ రవి మచ్చ గారు, అలాగే టీం అంతా కూడా ఒక ఫ్యామిలీలా అహర్నిశలు కష్టపడ్డారు. ఎన్నో సినిమాలు కామిక్స్ రూపంలో వచ్చాయి. ‘అన్‌స్టాపబుల్’ మూడు సీజన్లు సక్సెస్ అయ్యాయి. అందుకే సీజన్-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్ రూపంలో ట్రైలర్ తీసుకొచ్చారు. రాజీవ్ అండ్ టీం చాలా అద్భుతంగా రూపొందించారు. సీజన్ 4 చాలా అద్భుతంగా వస్తుంది. ఎంత బాగుంటుందో ముందు ముందు మీరే చూస్తారు. అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.
Also Read
- Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
- Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
- Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. 'నా శ్రీమతి' అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
తాజావార్తలు
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!