క్యారెక్టర్ యాక్టర్ గా సుమంత్ చేసిన రెండు సినిమాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. కానీ అతను సోలో హీరోగా నటించిన సినిమాలు మాత్రం విడుదల కాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్. అతని తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’ మను యజ్ఞ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని, ఆయన పాత్ర రొటిన్‌కు భిన్నంగా వుంటుందని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆ పాత్ర తప్పకుండా నచ్చుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.…
మను యజ్ఞ దర్శకత్వంలో అక్కినేని హీరో సుమంత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘అనగనగా ఒక రౌడీ’. ఏక్ ధో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డాక్టర్ టిఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చుతుండగా, సినిమాటోగ్రఫీని పవన్ కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధనరాజ్, మధునందన్, మిర్చి కిరణ్, మనోజ్ నందన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ మాస్…