ప్రజంట్ సినిమాలో పాటలు పడటం గురించి పక్కన పెడితే, పెద్ద పెద్ద సింగర్‌లు అంతా ప్రపంచ పర్యటనలో భాగంగా కాన్సర్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా బెంగుళూర్‌ల్లో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ కాన్సర్ట్ కూడా జోరుగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో భాగంగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఓ అభిమాని తనతో దురుసుగా ప్రవర్తించాడని ఆయన వెల్లడించారు.. అంతే కాదు ప్రజంట్ సోనూ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఏం జరిగింది అంటే..
Also Read : Chiru Anil: నయనతార కోసం తగ్గేదేలే!
సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతుండగా ఓ అభిమాని కన్నడలోనే పాడాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో సోనూ పాటలు పాడడం ఆపేసి ‘ మీ భాష పై నాకు కూడా అభిమానం ఉంది. కన్నడ భాషను నేను గౌరవిస్తాను’ అని చెప్పరట. అయిన కూడా ఆ అభిమాని తనను బెదిరించినట్లు మాట్లాడారట. ఇక సహనం కోల్పోయిన ఆయన మాట్లాడుతూ ‘ పహల్గాం లో ఏం జరిగిందో దానికి ఇదే కారణం, కచ్చితంగా ఇదే.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగా ఆ దాడి జరిగింది’ అని అన్నాడట. దీంతో సోనూ భాషను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని కన్నడ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Nani: ది ప్యారడైజ్‌లోకి అడుగు పెట్టేది అప్పుడే!
అయితే దీనిపై స్పందించిన సోనూ.. ‘నేను అన్ని భాషల్లో పాటలు పాడాను. కానీ, నా జీవితంలో ఎక్కువ మంచి పాటలు పాడింది మాత్రం కన్నడలోనే. నేను ఇక్కడికి (బెంగుళూరు) వచ్చినప్పుడల్లా మీరు నా పై ఎంతో ప్రేమ చూపిస్తారు. ఎన్నో ప్రదర్శనలు చేశాను. మీరు నన్ను మీ కుటుంబంలో వ్యక్తిగా అనుకోవడం నాకు దక్కిన గౌరవం భావిస్తాను. కానీ, ఆ అబ్బాయి నాతో అలా మాట్లాడటం నచ్చలేదు. అతడు పుట్టకముందు నుంచి నేను కన్నడలో పాటలు పాడుతున్నాను. అలా అసభ్యంగా బెదిరించడంతో నాకు బాధగా అనిపించింది. నేను ప్రపంచంలో ఎక్కడ కాన్సర్ట్ చేసినా.. అక్కడ ఉన్న వేల మందిలో కచ్చితంగా కన్నడ వాళ్ళు ఉంటారు. వారి కోసమే ఆ భాషలో పాటలు పాడతాను. దీన్ని గుర్తించాలి’ అని అన్నారు.