ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హావ అనేది ఎంతటి కీ రోల్ పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా సినిమా నటులకు ఇది చాలా అవసరం. హీరోలకు ఫ్యాన్స్ కుమధ్య సోషల్ మీడియా అనేది ఒక వారధి లాగా పనిచేస్తుంది. అది ఏ ప్లాట్ ఫామ్ అయిన హీరోలు తమ చిత్రాలకు సంబంధించిన ముఖ్యమైన అప్ డేట్స్ ను వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ఏ హీరోకు కు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది రికార్డుగా భావిస్తారు ఫ్యాన్స్.
Also Read : VenkyAnil3 : క్లైమాక్స్ షూట్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెనక్కి తగ్గేదే లేదు..
పాపులర్ ప్లాట్ ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో టాలీవుడ్ లో అత్యధికంగా ఫాలోయర్స్ ఉన్న స్టార్ హీరోలు ఎవరెవరో చుస్తే.. ముందుగా అందరి కంటే ఎక్కువగా ఫాలోవర్స్ కలిగిన హీరోగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. బన్నీ ఇన్‌స్టాగ్రామ్ లో – 26.4M ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రెండవ స్థానం లో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈయనను ఇన్‌స్టాగ్రామ్ లో 25M ఫాలో అవుతున్నారు. ఇక మూడవ స్థానంలో రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ – 21.8M ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. నాలుగవ స్తానంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు – 14.4M కలిగి ఉండగా, ఐదవ స్తానంలో రెబల్ స్టార్ ప్రభాస్ – 12.8M ఫాలోవర్స్ ను సాధించారు. మర్చి నెలలో 21M ఉన్న రామ్ చరణ్ కేవలం అతి కొద్దీ సమయంలోనే 25M ను అందుకున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ నువ్వా నేనా అన్నట్టు దూసుకెళ్తున్నారు.