రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ వారం రోజుల గ్యాప్ తర్వాత మరల ప్రారంభమైంది. ఆమధ్య సీక్రెట్ గా ఓపెనింగ్ చేసిన రాజమౌళి అంతే సీక్రెట్ గా షూటింగ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూట్ లొకేషన్ వివరాలు సహా ఏ వివరాలు బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సెట్లోకి ఫోన్ లు అనుమతించడం లేదు, ప్లాస్టిక్ ఐటమ్స్ ని అనుమతించడం లేదు. చాలా రోజులపాటు షూట్ చేయాల్సిన నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా సోదరుడి వివాహం ముంబైలో జరిగింది. ఈ వివాహం కోసం ఆమె వారం రోజులు బ్రేక్ తీసుకుంది.
Harish Shankar: మీరు మంచి సినిమాలు చేస్తే ఎందుకు చూడరు హరీష్ శంకర్?
మరోపక్క రాజమౌళి దగ్గర బంధువులలో ఒకరు చనిపోవడంతో ఆ కార్యక్రమాలకు రాజమౌళి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక అలా వారం రోజుల గ్యాప్ తర్వాత రాజమౌళి మరల సినిమా షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాదులో ఉన్న ఆల్ల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కే ఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమా ఒక అడ్వెంచర్స్ డ్రామాగా రూపు దిద్దుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంక చోప్రా సహా పలు హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారు. సినిమాలోని నటీనటులు సహా ప్రొడక్షన్ బాయ్ వరకు అనేక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లు సైన్ చేసిన తర్వాతే సెట్లోకి అడుగుపెట్టేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.