తాజాగా జరిగిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మనోళ్లు (తెలుగు ప్రేక్షకులు) మన సినిమాలు చూడరు కానీ బయట సినిమాలు బానే చూస్తారు. కాబట్టి ఈ సినిమాని కూడా చూడాలంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన వెటకారంగా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ అయ్యేలా చేశాయి.. నిజానికి హరీష్ శంకర్ కెరియర్ మొదటి నుంచి స్ట్రైట్ సినిమాలు కంటే ఎక్కువగా రీమేక్ సినిమాలే చేశారు. చివరిగా ఆయన చేసిన మిస్టర్ బచ్చన్ కూడా హిందీలో రూపొందిన రైడ్ సినిమాకి రీమేకే. మిస్టర్ మజ్ను డిజాస్టర్ గా నిలవడంతో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ ని చెక్కే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ కి హాజరవుతున్నారు.
Manchu Manoj: నారా లోకేష్ ను కలిసిన మంచు మనోజ్
అయితే తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బావుంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు కానీ హరీష్ శంకర్ మాత్రం తెలుగు సినిమాలను పక్కనపెట్టి వేరే భాషల సినిమాలను ఆదరిస్తున్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. మీరు మంచి సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలు కాకుండా వేరే భాషల సినిమా కోసం ఎందుకు ఆసక్తి చూపిస్తారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.. ఇక AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది.