Sri Sri Sri Raja Varu: దేవర రిలీజ్ రోజే బామ్మర్ది సినిమా టీజర్.. చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“మ్యాడ్”, “ఆయ్” చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, “శతమానం భవతి” సినిమాతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న కాంబోలో ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” తెరకెక్కింది. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ సరసన సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోండగా సరిగ్గా ఎన్టీఆర్ దేవర రిలీజ్ రోజే టీజర్ ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” టీజర్ చూశాను చాలా బాగుంది. ప్రేమను ఎలక్షన్స్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
Casting Couch: ఒక సినిమా కోసం ఐదుగురు నిర్మాతలు పడుకోమన్నారు.. హీరోయిన్ సంచలనం
Also Read
దర్శకుడు సతీష్ వేగేశ్న గతంలో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్ లోనే మూవీ ఉంటుందని తెలుస్తోంది. మంచి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. నార్నే నితిన్ నాకు ఎన్టీఆర్ గారి మ్యారేజ్ టైమ్ నుంచి తెలుసు. మ్యాడ్, ఆయ్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ఆయనకు ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని నమ్ముతున్నాను. నార్నే నితిన్ ను మాసీగా ప్రెజెంట్ చేశారు సతీష్ వేగేశ్న గారు. రామారావు గారు ఎప్పటినుంచో ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ రామారావు గారికి కూడా నా బెస్ట్ విశెస్ చెబుతున్నా, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!