Sri Satya Comments on Lip Filling Surgery: తెలుగు అమ్మాయి శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె బిగ్ బాస్ ద్వారా మాత్రం తెలుగు వారందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అయితే నిజానికి బిగ్ బాస్ లో ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా ఆమెకు ఏమీ వర్కౌట్ కాలేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా భారీగా ఆమెకు అవకాశాలు ఏమీ వచ్చి పడలేదు. అయితే ఎప్పటికైనా సినిమాల్లో రాణించాలనే లక్ష్యంతో ఉన్న ఆమె సీరియల్స్ లో కూడా నటించడం మానేసింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన సినిమాలకు సంబంధించి కెరీర్ కి సంబంధించి అలాగే తాజా సర్జరీకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయట పెట్టింది.
Saripodhaa Sanivaaram: నాని ఉల్లాసం చూశారా.. సెకండ్ సింగిల్ వచ్చేసింది!
అదేంటంటే తాను టిల్లు స్క్వేర్ సినిమాలో ఒక పాటలో డాన్స్ చేశానని అది ఎడిటింగ్ లో మిస్ అయింది అని చెప్పుకొచ్చింది. అలాగే ఎక్కడ లీడ్గా అవకాశాల కోసం వెళ్లినా ముఖం చిన్నదిగా కనిపిస్తోందని అనేవారు. దాన్ని ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తూ ఉండగా లిప్ ఫిల్లర్స్ చేయిస్తే బాగుంటుందని తెలిసింది. అందుకే టెంపరరీగా మూడు నాలుగు నెలల కోసం ఇలా లిప్ ఫిల్లర్స్ చేయించాను. అయితే ఇప్పుడు చాలామంది అప్పటి లుక్ బాగుందని అంటున్నారు కానీ సినిమా చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడే బాగున్నావు మెచ్యూరిటీ కనిపిస్తోందని అంటున్నారు అని చెప్పుకొచ్చింది. ఇక డాన్స్ షోలో తాను చేస్తున్న సమయంలో ఎవరితో డాన్స్ చేసినా వారితో సంబంధం అంటగడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది సరైన పద్ధతి కాదని ఎందుకంటే ప్రొఫెషనల్ విధానం వేరు, పర్సనల్ వ్యవహారం వేరని ఆమె అభిప్రాయపడింది.