Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sri Mani Birthday Special Telugu Lyricists Career Journey From 100 Love To Stardom

Sri Mani : సాహిత్యం ప్రెష్‌గా అనిపించేలా ప్రయత్నిస్తుంటా

Published Date :September 15, 2025 , 8:30 am
By Bhargav Chaganti
Sri Mani : సాహిత్యం ప్రెష్‌గా అనిపించేలా ప్రయత్నిస్తుంటా
  • Follow Us :
  • google news
  • dailyhunt

పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక : ప్రముఖ గీత రచయిత శ్రీమణి
‘100 పర్సెంట్‌ లవ్‌’ చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి. అనతికాలంలోనే టాప్‌ లిరిక్‌ రైటర్స్‌ల్లో ఒకరిగా పేరుపొందిన ఈ యువ గీత రచయిత పుట్టినరోజు సెప్టెంబరు 15 ( సోమవారం). ఈసందర్భంగా తన కెరీర్‌ విషయాలను మీడియాతో పంచుకున్నారు శ్రీమణి. ఆ విశేషాలివి.

ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా ఉందా?
ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కాకపోతే నా సాహిత్యపు జర్నీలో మరో మెట్టు ఎక్కాలని.. కొత్త అఛీవ్‌మెంట్‌ సాధించాలి అదే నా లక్ష్యం. ఈ రోజే నా లైఫ్ మొదలైంది అనే భావనతో కొత్త కొత్త పనులు చేయాలని.. ఆ పనులను పుట్టినరోజు నాడే ఆరంభం కావాలని కోరుకుంటాను.

ఈ సంవత్సరం మీరు సాహిత్యం అందించిన పాటలు మీకు ఎలాంటి సంతృప్తి నిచ్చాయి?
సాహిత్య పరంగా లోతైన సన్నివేశాలకు సాంగ్‌లు అందించే అవకాశం నాకు లభించింది. ముఖ్యంగా తండేల్‌లో బుజ్జితల్లి, హైలెస్సా పాటలతో పాటు లక్కీ భాస్కర్‌లోని నిజమా కలా, ఆయ్‌ సినిమాలోని పాటలు నాకు మంచి నాకు పేరును తెచ్చిపెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నవేశం తాలూకా లోతైన భావం చెప్పడమే. ఇలాంటి పాటలు రాసే అవకాశం రావడం గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఈ పాటలను రాయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులకు, దర్శక, నిర్మాతలకు కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను.

మీ ప్రయాణంలో సాహిత్య పరంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా మిమ్మలను మీరు ఎలా అప్‌డేట్‌ చేసుకుంటున్నారు? పాటను ఎంత వరకు చాలెంజ్‌గా తీసుకుంటారు:?
నాకు ప్రతి పాటకు ఏదో ఒక ఛాలెంజ్‌ ఉంటుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో సంగీతంతో పాటు సాహిత్యంలో సౌండ్‌ డిజైనింగ్ మారింది. శబ్ధ సౌందర్యం ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే నేను ట్రెండ్‌కు తగ్గట్టుగా, స్టాండర్స్‌ మిస్‌ అవ్వకుండా, పాటకు కాలపరిమితి లేకుండా అంటే పదేళ్ల తరువాత కూడా సాహిత్యం ప్రెష్‌గా అనిపించేలా ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగానే నన్ను నేను మార్చుకుంటాను.

ప్రేమ పాటలు చాలా ఎక్కువగా రాస్తుంటారు? వీటిలో కొత్తదనం ఎలా చూపిస్తారు?
ప్రేమ అనేది యూనివర్శల్‌. ప్రతి పాటలో, భావంలో కొత్తదనం దొరుకుతుంది. కొత్త ఎక్స్‌ప్రేషన్‌ ఉంటుంది. పాట సున్నితపదాలతో అందరికి అర్థమయ్యేలా ఎమోషన్‌ మిస్‌ అవ్వకుండా రాయడం.. శబ్దంలో అర్థం ఉండేలా చూసుకోవడం చేస్తుంటాను.

ఇప్పటి వరకు మీరు రాసిన పాటల్లో మీ ఫేవరేట్‌ సాంగ్‌ ఏమైనా ఉందా?
అన్ని పాటలు ఇష్టపడే రాస్తాను. నేను రాసిన ప్రతి పాట నాకు ఫేవరేటే. రచయితకు ఎప్పుడూ సంతృప్తి ఉండాలి. ఎప్పుడూ ఇంకా రాయాలి.. ఇంకా కొత్త సాహిత్యం అందించాలనే కోరుకుంటాడు.

సోషల్ మీడియా ట్రెండ్‌లో పాట ఇన్‌స్టంట్‌ హిట్‌ అవ్వడం అనేది తప్పనిసరి అయ్యింది? మీకు ఇది ఎలాంటి టార్గెట్‌లా ఉంటుంది?
ఇది రచయింతలందరికి కత్తి మీద సాము లాంటింది. ఇంతకు ముందు పాట రీచ్‌ అవ్వడానికి టైమ్‌ పట్టేది. ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రభావంతో వినగానే నచ్చేయాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అందుకే తగ్గట్టుగానే పాటలు ఇన్‌స్టంట్‌ చార్ట్‌బస్టర్‌లుగా నిలుస్తున్నాయి. అయితే ఇదే పాటను పది సంవత్సరాల తరువాత కూడా సేమ్‌ ఫీలింగ్‌ ఉండాలి అనే భావనతో అందరం పాటలు రాస్తున్నాం

మీకు ఎక్కువ ఏ తరహా పాటలు రాయడానికి అవకాశం వస్తుంటాయి? పాట రాయడానికి మీరు కథ మొత్తం వింటారా?
అరడుగుల బుల్లెట్‌ పాట తరువాత హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌లు రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఎక్కడ ఎక్కడ సాంగ్‌ తరువాత ప్రేమ పాటలు అవకాశాలు వచ్చాయి. మహర్షిలో ఇదే కద.. అనే పాటను కథ మొత్తం విని రాశాను. కొన్ని సాంగ్స్‌ సిట్యుయేషన్‌తో రాస్తాను.

మీరు ఇప్పటి వరకు రాసిన పాటల్లో గర్వపడే పాట అంటే ఏమీ చెబుతారు?
నేను గర్వపడే పాటను నేను నిర్ణయించలేను. మనం రాసిన పాట గురించి మనం గౌరవించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు గొప్పగా చెప్పినప్పుడు బాగా సంతృప్తి దొరుకుతుంది. నన్ను గేయ రచయితగా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ గారు ‘గీతా గోవిందం’ సినిమాలో వచ్చిందమ్మా పాట గురించి బాగా మెచ్చుకున్నారు. బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్‌ చేశారు. నన్ను ఇండస్గ్రీకి పరిచయం చేసిన వ్యక్తి నన్ను అభినందించడం నాకు గొప్పగా అనిపించింది. మహర్షి పాట విని సిరివెన్నెల సీతరామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి అభినందించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇలాంటి సమయాల్లో గొప్ప పాటను రాశాననే భావన కలుగుతుంది.

పాటల రచయితగా కాకుండా మీకు దర్శకత్వం వైపు కూడా ఆలోచన ఉందా?
దర్శకత్వం వైపు నాకు ఆలోచన లేదు. కానీ పరిపూర్ణ రచయితగా ఎదగాలి అనేది నా బలమైన కోరిక. ఇంతకు ముందు నేను తెలిసిన మిత్రులతో కలిసి కథా చర్చల్లో పాల్గొనేవాడిని. అందుకే దానిని ఆచరణలోకి తీసుకవచ్చి సంభాషణలు రాయాలని ఉంది. రచన అంటే నాకు ప్రాణం. సాహిత్యం విలువ పెంచాలి అనేది నా కోరిక.

ప్రస్తుతం మీరు పాటలు అందిస్తున్న చిత్రాలు?
దుల్కార్‌సల్మాన్‌ ‘ఆకాశంలో ఓ తార’ చిత్రంతో పాటు సాయి దుర్గా తేజ్‌ సంబరాల ఏటిగట్టు, ఇండియా హౌస్‌ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలకు సాహిత్యం అందిస్తున్నాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 100% Love
  • attarintiki daredi
  • birthday September 15
  • career highlights
  • Filmfare Award

తాజావార్తలు

  • Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’

  • Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions