Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కథల ఎంపికలో ఎప్పుడూ విభిన్నమైన రూట్ ఎంచుకునే హీరో శ్రీవిష్ణు, తాజాగా ‘కామ్రేడ్ కళ్యాణ్’గా అవతారమెత్తి ఈ సంచలనానికి తెరతీశారు. ‘తాడికొండ కళ్యాణ్’ అనే వాంటెడ్ నక్సలైట్ పాత్రలో శ్రీవిష్ణు విశ్వరూపం చూపించిన ఈ చిత్ర టీజర్ ప్రస్తుతం నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన హోం మినిస్టర్‌నే పట్టపగలు అడవిలోకి ఎత్తుకెళ్లిపోయారు. చుట్టూ తుపాకులు పట్టుకున్న కామ్రేడ్లు, మధ్యలో బందీగా హోం మంత్రి.. పాయింట్ బ్లాంక్‌లో పోలీసులకే సవాల్ విసురుతూ సాక్షాత్తూ హోం మినిస్టర్ సతీమణికే ఫోన్ చేసి, “మీ ఆయన మా దగ్గర క్షేమంగానే ఉన్నాడు.. పొద్దున్నే గుడ్డు పెట్టాం, మధ్యాహ్నం ఆ గుడ్డు పెట్టిన కోడిని కోసి పెట్టాం.. రాత్రికేమో కోడిగుడ్డు వేపుడు!” అంటూ వాయిస్ రికార్డ్ చేసి పంపించాడు ఓ నక్సలైట్ లీడర్. ఇంతకీ పోలీసుల నిద్ర చెడగొడుతున్న ఆ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ఎవరు?
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు మార్క్ వినోదంతో పాటు సాలిడ్ యాక్షన్, భావోద్వేగాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అడవుల్లో తుపాకీ పట్టిన నక్సలైట్ జీవితం వెనుక ఒక బలమైన ఎమోషన్ ఉంటుందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే, మరోవైపు ఊపిరిసలపని వినోదాన్ని ఇందులో మేళవించారు. శ్రీవిష్ణు సరసన నాయిక ప్రేమాయణం, మరోవైపు సత్య వేసే పంచ్‌లు టీజర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రావు రమేష్ హోం మంత్రి పాత్రలో కనిపించగా, భీకరమైన అటవీ పోరాటాలు, భారీ పోలీస్ ఆపరేషన్లు టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. సీతా కర్నాటి, వెంకట కృష్ణ కర్నాటి నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం అడవిలోని గన్‌ఫైర్ సౌండ్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. పోలీస్ ఎన్కౌంటర్లను దాటుకుని హోం మినిస్టర్‌ను కామ్రేడ్ కళ్యాణ్ ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? అడవిలో ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠను రేపుతూ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Also Read
- Sardar 2: 'స్పైడర్'లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
- Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
- Ee Paata Korinavaaru : ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత పొడవైన టైటిల్
- Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
తాజావార్తలు
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
-
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
-
Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
-
Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!