Sandeep Reddy Vanga: ‘సినిమాలపై ఏడవడం కాదు..’ వారిపై సందీప్ రెడ్డి వంగా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeep Reddy Vanga: సమాజంలో ఏ దారుణం జరిగినా దానికి సినిమాలే కారణమంటూ వేలెత్తి చూపే వర్గానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. నిజమైన నేరస్థులను, వ్యవస్థలోని లోపాలను వదిలేసి ప్రతీదానికీ సింపుల్‌గా సినిమాను బలిపశువును చేయడం కొందరికి అలవాటుగా మారిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. సమాజంలో ఏం జరిగినా కొందరు పనిగట్టుకొని ప్రధానంగా సినిమాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఇండస్ట్రీలో కెరీర్ ముగిసిపోయి, పనుల్లేక ఫ్రస్ట్రేషన్లో కొట్టుమిట్టాడుతున్న కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలే ఈ తరహా దాడికి దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఓ దారుణ ఘటన జరగడమే ఆలస్యం.. ఇలాంటి వారంతా ఒక్కసారిగా నిద్రలేచి, ‘సమాజ సంస్కర్తల’ ముసుగు తగిలించుకుంటారని ఎద్దేవా చేశారు.
నిజానికి వీరికి నేరాల గురించో, బాధితుల వేదన గురించో కనీస పట్టింపు ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు. కేవలం ఇతరుల శ్రమను, ఎదుటివారి విజయాలను చూసి ఓర్వలేక.. ఆ మానసిక క్షోభను, వ్యక్తిగత అక్కసును వెళ్లగక్కేందుకే ఇలాంటి భయానక ఘటనలను ఒక ‘మురికి సాకు’గా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటివారి క్రియేటివిటీపై ఆధారపడి బతికే ఇలాంటి పరాన్నజీవులకు బాధితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదని ఆయన మండిపడ్డారు. సమాజంలో దారుణాలు జరిగినప్పుడు అసలు సమస్య ఎక్కడుందో శోధించి, బాధితుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. ఆ దిశగా ఆలోచించకుండా, తమ సొంత ఎజెండాల కోసం సినిమాలను టార్గెట్ చేసే అవకాశవాదానికి, నిజమైన సానుభూతికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలని సందీప్ వారికి హితవు పలికారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.
Also Read
When someone commits a heinous crime, the first response should be empathy & an attempt to understand the larger problem. Not finding a convenient scapegoat in cinema.
It is becoming increasingly clear that your concern is not for the victims or their families, but that you’re using a horrific tragedy as a dirty excuse to settle your personal scores.
This is especially directed at those failed frustrated jobless male/female actors, few directors, producers & parasites, who suddenly appoint themselves as social reformers whenever an opportunity arises to take a dig at someone else’s work.A tragedy deserves empathy 🙏, not opportunism. Learn the difference.
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 4, 2026
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: ‘సినిమాలపై ఏడవడం కాదు..’ వారిపై సందీప్ రెడ్డి వంగా ఫైర్
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!